ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్-బాలయ్య

ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్-బాలయ్య

నందమూరి తారకరామారావు ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణించారు నందమూరి బాలకృష్ణ... విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ గురించి తప్పుగా మాట్లాడితే సూర్యున్ని వేలితో చూపించడమే అవుతుందన్నారు.. ఎటువంటి పరిస్థితులకు వెదరని బెదరని మనిషి ఎన్టీఆర్ అన్న బాలయ్య.. ఆయన యుగ పురుషుడు.. ఆయన జీవితం మనందరికి ఓ పాఠ్యాంశం అన్నారు. ఎన్టీఆర్ పుట్టినాకే ఆవేశం పుట్టిందన్నారు బాలయ్య.. ఎంతో మంది ఆధ్యాత్మికం కోసంమే కాదు.. సమాజం కోసం కూడా పోరాటం చేశారు.. ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ మాత్రమే చేశారన్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అని నిరూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్‌.. ప్రపంచంలోనే గొప్ప అందగాడని.. ఆయనలాంటి అందగాడు ప్రపంచంలోనే లేదని అనిపిస్తుందన్నారు. 

ఎన్టీఆర్ సమాజంలో కొత్త ఒరవడి సృష్టించారన్నారు బాలయ్య.. ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్. కమర్షియల్ ట్రెండ్ సెట్టర్.. భారత చలనచిత్ర రంగంలోనే నంబర్ వన్‌ అని తెలిపారు.. పేదల జీవితాల్లో వెలుగును నింపిన వ్యక్తి ఎన్టీఆరేనని.. పండగలకే బియ్యం తినే ప్రజలకు... కిలో రెండు రూపాయల బియ్యం అందజేసిన మహానుభావుడన్నారు. తెలుగువారికి కూడు, గూడు, గుడ్డ అందజేసిన వ్యక్తి ఆయన అని.. నేను హిందూపురం ఎమ్మెల్యేని.. మా దగ్గర ఉన్న హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానస పుత్రికలేనని గుర్తుచేశారు.. శారీరకంగా మన ముందు లేకున్నా... ఆయన చిరస్మరణీయుడని తెలిపారు బాలయ్య.