'సేవ బాధ్యత.. భారం కాదు..'

'సేవ బాధ్యత.. భారం కాదు..'

సేవ చేయడాన్ని బాధ్యతగా ఫీల్ కావాలని.. కానీ, భారంగా కాదు అన్నారు ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌తార‌క‌ం ఇండో - అమెరిక‌న్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన తన 59వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన... క్యాన్సర్ బాధిత చిన్నారులతో కలిసి కేక్ కట్‌చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానురాను నాకు వయసు తగ్గుతుందని వ్యాఖ్యానించారు. అందరూ పుడతారు.. గిడుతారు.. మంచి పేరు తెచ్చుకున్న వారు.. శారీరకంగా లేకున్నా.. చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. బసవతారకం ఆస్పత్రిలో సేవలు, సినిమాల్లో నటన, హిందూపురం ఎమ్మెల్యేగా సేవలు అందించటం నా పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేసిన బాలయ్య... క్యాన్సర్ రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. క్యాన్సర్‌పై పోరాటంలో నాన్న గారి కలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపం ఇచ్చారని గుర్తుచేసేశారు బాలకృష్ణ.