నందమూరి ఫ్యామిలీతో బాబు..

నందమూరి ఫ్యామిలీతో బాబు..

నందమూరి వారసురాలిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో దింపింది.  దివంగత నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. రేపు నామినేషన్‌ వేయనున్నారు. ఇదే విషయాన్ని ఇవాళ ఆమె మీడియాకు చెప్పారు. తాత ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ, మావయ్య చంద్రబాబుల స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. తనపై నమ్మకంతో టికెట్‌ ఇచ్చిన చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. ఇక.. చంద్రబాబును సుహాసిని కలిసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో నందమూరి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.