నందమూరి హీరో సినిమా.. మూడేళ్లు ఆలస్యంగా

నందమూరి హీరో సినిమా.. మూడేళ్లు ఆలస్యంగా

నందమూరి హీరోలో తారకరత్న కూడా ఒకరు. కెరీర్ ఆరంభంలో 'ఒకటితో నెంబర్ కుర్రాడు, యువరత్న' వంటి సినిమాలతో అలరించిన ఈ హీరో కెరీర్ ఆ తర్వాత డీలా పడిపోయింది.  వరుసగా ఇసినిమాలు పరాజయం చెందాయి.  హీరోగా సినిమాలు రావడమే కష్టమైంది.  అరకొర వచ్చినా ఎప్పుడు వచ్చాయా ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలిసేది కాదు.  సైన్ చేసిన కొన్ని సినిమాలు ఆరంభమై ఆగిపోయిన సందర్భాలు బోలెడు. 

ఇంకొన్ని సినిమాలైతే పూర్తైనా విడుదలకు నోచుకునేవి కాదు.  అలాంటి సినిమానే 'కాకతీయుడు'.  సినిమా పూర్తై దగ్గరదగ్గర మూడేళ్ళ కావొస్తోంది.  ఇన్నాళ్లు ఏవో కారణాల రీత్యా విడుదలకాని ఈ సినిమా ఎట్టకేలకు రేపు శుక్రవారం 5వ తేదీన విడుదలకానుంది. విజయ్ సముద్రాల దర్శకత్వం  వహించిన ఈ సినిమాను లగడపాటి శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు.