మహారాష్ట్రలో పోటీకి టీఆర్ఎస్ రెడీ..!?

మహారాష్ట్రలో పోటీకి టీఆర్ఎస్ రెడీ..!?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పథకాలతో ప్రజలను ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రజల అభిమాన్ని చురగొని రెండోసారి కూడా తిరుగులేని మెజార్టీలోకి మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇక, పొరుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు.

ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావుకు తెలిపి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉద్యమం నిర్వహించిన ఉద్యమ నాయకుడు, బాబ్లీ సర్పంచ్ శ్రీ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో నాందేడ్ జిల్లాకు చెందిన నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పోటీ చేయడం ఖాయమేమరి.