బ్రేక్ కోసం నందిత ప్రయత్నం

బ్రేక్ కోసం నందిత ప్రయత్నం

నందిత రాజ్ టాలెంటెడ్ హీరోయిన్... ప్రేమకథా చిత్రం సినిమాలో ఆమె నటనకు చాలామంది ఫిదా అయ్యారు.  మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది.  ఈ సినిమా తరువాత అనేక సినిమాలు చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది.  హీరోయిన్ గా బ్రేక్ ఇవ్వలేకపోయాయి.  అవకాశాలు వస్తున్నాయి గాని, స్టార్ హీరోయిన్ గా ఎదిగేంత అవకాశాలు రావడం లేదు.  ఎదగడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది.  

ప్రస్తుతం ఈ అమ్మడు విశ్వామిత్ర అనే సినిమా చేస్తున్నది.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.  జూన్ 14 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది నందిత.  మరి ఈ సినిమా అయినా ఆమెకు బ్రేక్ ఇస్తుందా చూద్దాం.