బొమ్మ బ్లాక్‌బస్టర్ లిరికల్ వీడియో..

బొమ్మ బ్లాక్‌బస్టర్ లిరికల్ వీడియో..

నందు విజయ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా బొమ్మ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాని విజయీభవ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు కొత్త దర్శకుడు రాజ్ విరాట్ పరిచయం కానున్నాడు. ఈ సినిమా టీజర్ సినీ వర్గాల్లో కూడా అనూహ్య స్పందన సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల మొదటి లిరికల్ పాట మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో విడుదలైంది. నడకుడి రైటంటి సోదరా అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాట కొత్త తరహా ట్యూన్‌తో అందరికీ నచ్చే విధంగా ఉంది. ఇందులో నందూ కూడా చాలా నాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పాటను యంగ్ హీరో సుధీర్ బాబు విడుదల చేశాడు. ఈ సినిమా టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉందని, ఇందులో నందూ చాలా కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నాడని, సినిమా తప్పక విజయం సాధిస్తుందని సుధీర్ అన్నాడు. ఈ సినిమా నందూకి కెరీర్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.