నంద్యాల టికెట్ మా కూతురికి ఇవ్వండి..

నంద్యాల టికెట్ మా కూతురికి ఇవ్వండి..

ఏపీ సీఎం చంద్రబాబుతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమావేశమయ్యారు. నంద్యాల పార్లమెంట్ స్థానానికి తన కూతురికి అవకాశమివ్వాలని పార్టీ అధ్యక్షుడిని ఆయన కోరారు. ఇదే విషయమై రేపు మరోసారి కలువాలని చంద్రబాబు సూచించారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లు ఇంకా ఖరారు కాలేదని అన్నారు. మహిళా కోటాలో నంద్యాల ఎంపీ టికెట్ ను నా కూతురికి అడిగానని తెలిపారు. బుధవారం మరోసారి చంద్రబాబును కలిసి ఎంపీ టికెట్ అడుగుతానని, మేము కేవలం ఎంపీ టికెట్ మాత్రమే అడుగుతున్నామని ఎస్పీవై రెడ్డి తెలిపారు.