నాని సినిమాకు నిర్మాత దొరికాడు!

నాని సినిమాకు నిర్మాత దొరికాడు!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రొమాంటిక్ డ్రామా నాని, హనులకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. 'లై' సినిమా తరువాత హను.. నానితో సినిమా చేయాల్సివుంది కానీ 'లై' సినిమా ఫ్లాప్ కావడంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిపోయింది. 
ఆ తరువాత నాని, హాను ఇద్దరూ కూడా తమ తమ కమిట్మెంట్స్ తో బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. హను దర్శకుడిగా 'పడి పడి లేచే మనసు' సినిమాను నిర్మిస్తోన్న ప్రసాద్, సుధాకర్ లు నానితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో హను-నాని ల సినిమాకు తమే నిర్మాతలుగా వ్యవహరించాలని నిర్నయిచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నానికి అడ్వాన్సులు కూడా అందినట్లు సమాచారం. 'పడి పడి లేచే మనసు' సినిమా రిలీజ్ తరువాత హను ఈ ప్రాజెక్ట్ పై పని చేయనున్నాడు. మరి ఈసారి నానికి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి!