ఇప్పటివరకు బిగ్‌బాస్‌-2 ప్రస్తావన రాలేదు: నాని

ఇప్పటివరకు బిగ్‌బాస్‌-2 ప్రస్తావన రాలేదు: నాని
'స్టార్‌ మా'లో ప్రసారం అయిన పాపులర్ షో 'బిగ్‌బాస్‌' తెలుగు సీజన్‌-1లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సీజన్‌-1కు వచ్చిన గుర్తింపు కారణంగా సీజన్‌-2 కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహుకులు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ సీజన్‌-2లో టాలీవుడ్ నేచురల్ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా వ్యహస్తరిస్తాడని జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై హీరో నాని స్పందిస్తూ... ఇప్పటివరకు తన వద్దకు బిగ్‌బాస్‌-2 ప్రస్తావన రాలేదని, ఒకవేళ వస్తే చెబుతానని అన్నాడు. ఇంకా నాని మాట్లాడుతూ... మేర్లపాక గాంధీ 'కృష్ణార్జున యుద్ధం' సినిమా కథ చెప్పినప్పుడు విభిన్నంగా అనిపించిందని అన్నారు. నాగార్జున నటించిన 'హలో బ్రదర్‌‌' సినిమాకు.. దీనికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ సినిమాలో కృష్ణార్జునులు కలిసి యుద్ధం చేస్తారని.. ఎవరిపై ఎవరు ఎందుకు చేస్తారో థియేటర్లలో చూడండి అని అన్నారు. ఇక కింగ్ నాగార్జునతో కలిసి మరో చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.