నాని జెర్సీ సెన్సార్ పూర్తి

నాని జెర్సీ సెన్సార్ పూర్తి

నాని జెర్సీ సినిమా ఏప్రిల్ 19 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  వరస పరాజయాలతో సతమతమౌతున్న నాని ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.  ట్రైలర్ తో అంచనాలు రెట్టింపయ్యాయి.  క్రికెట్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ ను పొందింది.  

ఇటీవల కాలంలో యు సర్టిఫికెట్ పొందిన సినిమాలు బహు అరుదుగా కనిపిస్తున్నాయి.  ఈ సినిమా ఆ కోవలో చేరడం విశేషం.  జీవితంలో ఫెయిల్యూర్ అయ్యిన యువకుడు, మిడిల్ ఏజ్ లో తిరిగి క్రికెటర్ గా ఎలా మారాడు.  ఎలా విజయం సాధించాడు అన్నది కథ.  ఈ కథ ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 19 వరకు ఆగాల్సిందే.