తమిళంలో రీమేక్ కానున్న మరో తెలుగు సినిమా..!!

తమిళంలో రీమేక్ కానున్న మరో తెలుగు సినిమా..!!

టాలీవుడ్ హిట్ రేట్ పెరిగింది.  అభిరుచి ఉన్న దర్శకులు, ప్రయోగాలకు సిద్దపడే హీరోలు, ప్రేక్షకుల నాడి తెలుసుకొని దానికి తగినట్టుగా సినిమాలను రూపొందించగలిగే నిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు.  దీంతో ఇండస్ట్రీ హిట్స్ తో కళకళలాడుతున్నది.  తెలుగులో సూపర్ హిట్టైన టెంపర్, అర్జున్ రెడ్డి, నాన్నకు ప్రేమతో, ఆర్ ఎక్స్ 100 సినిమాలు తమిళంలో రీమేక్ కాబోతున్నాయి.  తాజాగా మరో సినిమాను తమిళ పరిశ్రమ రీమేక్ చేయబోతున్నది.  అదే నాని హీరోగా వచ్చిన నిన్నుకోరి సినిమా.  

2017 లో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.  ఇందులో అడిగా అడిగా సాంగ్ బెస్ట్ వన్ గా నిలిచింది.  ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు.  తెలుగులో గొడవ సినిమాతో హీరోగా పరిచయమైన కోదండరామి రెడ్డి కొడుకు వైభవ్ తమిళ రీమేక్ లో నటించబోతున్నాడు.  కాస్మో కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా దర్శకుడు ఎవరు అన్నది ఫైనల్ కావాలి.  మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తారట.