మెగా ఫ్యాన్స్ తిట్లపై నాని రెస్పాన్స్ !

మెగా ఫ్యాన్స్ తిట్లపై నాని రెస్పాన్స్ !

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆ టైటిల్ కేవలం రామ్ చరణ్ కోసమేనని, నాని తన సినిమాకు ఎలా పెట్టుకుంటారని సోషల్ మీడియాలో తిట్ల దండకం మొదలుపెట్టారు.  దీనిపై తాజాగా జరిగిన 'జెర్సీ' సినిమా ఈవెంట్లో స్పందించాడు నాని.  చిరంజీవిగారి 'గ్యాంగ్ లీడర్' సినిమాకు తాను పెద్ద అభిమానినన్న నాని 'ఆ సినిమాకు నా సినిమాకు ఎలాంటి రిలేషన్ ఉండదు.  విడుదల తర్వాత నా సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిలే సరైనదని అందరికీ అనిపిస్తుంది' అంటూ క్లారిటీ ఇచ్చారు.