మహేష్ వేడుకలో నాని

మహేష్ వేడుకలో నాని

మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది.  దీంతో యూనిట్ సభ్యులు భారీ ఎత్తున వేడుక నిర్వహహించాలని నిర్ణయించారు.  ఈనెల 28న శిల్పకళా వేదికలో వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేచ్యురల్ స్థార్ నానిని ఆహ్వానించారట.  ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుతో మంచి సన్నిహిత్యం ఉండటం వలనే నాని ఈ వేడుకకు హాజరవుతున్నాడట.  సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు స్టార్ హీరోలే ముఖ్య అతిథులుగా హాజరయ్యేవారు.  కానీ మహేష్ కొత్తగా మీడియం రేంజ్ హీరోలను కూడా ఆహ్వానిస్తూ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు.