టక్ జగదీష్ టీజర్: ‘పండగలాంటి సినిమా’ అవుతుందా!

టక్ జగదీష్ టీజర్: ‘పండగలాంటి సినిమా’ అవుతుందా!

నాని హీరోగా రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం 'టక్ జగదీష్'. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీటవ్వాలని ఆశిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సినిమా టీజర్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా 'టక్ జగదీష్' టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ పూర్తిగా మాటలతో కాకుండా థమన్ సంగీతం.. థీమ్ పాటతో సాగింది. నాని, రీతు లవ్ ట్రాక్ తో పాటుగా, ఫైటింగ్ సీన్స్ కూడా చూపించారు. కాగా నాని కనిపించిన ప్రతి స్కీన్ లోను ‘టక్’ ప్రత్యేకంగా నిలిచింది. ఈ టీజర్ పై నాని ట్వీట్ చేస్తూ.. ‘పండగకి వచ్చే సినిమాలు కొన్ని… పండగలాంటి సినిమాలు కొన్ని’ అంటూ తనదైన డైలాగ్స్ తో ట్వీట్ చేశారు. ఏప్రిల్ 23న ఈ సినిమా థియేటర్ లోకి రానుంది.