టక్ జగదీష్ టీజర్ రిలీజ్ ఫిక్స్

టక్ జగదీష్ టీజర్ రిలీజ్ ఫిక్స్

నాచురల్ స్టార్ నాని సినిమా అంటే అభిమానునల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అతడి సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే నాని తాజాగా చేస్తున్న చిత్రం టక్‌జగదీష్ ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుల చేయనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సినిమా టీజర్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరపడినట్లే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈమేరకు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ 23న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల కానుందని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నాని చేతిలో గడ్డపలుగు పట్టుకొని సీరియస్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. దీనిని చూస్తే సినిమా యాక్షన్ కూడా బాగుంటుందని అర్థం అవుతుంది. మరి ఈ సినిమాతోనైనా నాని అనుకున్న స్థాయి హిట్ అందుకుంటాడేమో వేచి చూడాలి.