నన్ను దోచుకుందువటే.. ప్రీరిలీజ్ కు రెడీ..చీఫ్ గెస్ట్ ఎవరో..?

నన్ను దోచుకుందువటే.. ప్రీరిలీజ్ కు రెడీ..చీఫ్ గెస్ట్ ఎవరో..?

సుదీర్ బాబు నటిస్తూ.. నిర్మిస్తున్న సినిమా నన్ను దోచుకుందువటే.  సుదీర్ బాబు ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించిన తరువాత నిర్మించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.  అలనాటి సూపర్ హిట్ సాంగ్ లోనించి ఓ పదాన్ని సినిమా టైటిల్ గా పెట్టుకున్నారు.  

ఆర్ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ క్యూట్ లవ్ స్టోరీలో సుదీర్ బాబుకు జంటగా నభ నటేష్ నటిస్తున్నది.  సెప్టెంబర్ 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు దసపల్లా హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనే విషయాన్ని మాత్రం యూనిట్ బయట పెట్టడం లేదు. సుదీర్ బాబు సినిమాలకు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా వచ్చేవారు.  ఈ సినిమాకు కూడా మహేష్ బాబునే చీఫ్ గెస్ట్ గా వస్తాడా లేకుంటే మరెవరైనా వస్తారా అన్నది తెలియాలి.