ఔనా..! హెరిటేజ్‌ బాబుది కాదా..? మాదీ కాదు-భువనేశ్వరి

ఔనా..! హెరిటేజ్‌ బాబుది కాదా..? మాదీ కాదు-భువనేశ్వరి

ఉల్లి కొరత, ఉల్ల ధరలపై అసెంబ్లీలో టీడీపీ ఆందోళన సందర్భంగా... సీఎం వైఎస్ జగన్ వాటి ధరలను ప్రస్తావిస్తూ హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొంత దుమారమే రేగింది.. హెరిటేజ్ మాదికాదని చంద్రబాబు వ్యాఖ్యానించడం.. ఓ మంత్రి నాకు గిఫ్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించడం జరిగిపోయాయి. దీనిపై వివరణ ఇచ్చిన చంద్రబాబు... హెరిటేజ్ ఫ్రెష్‌ మాది కాదని.. హెరిటేజ్ ఫుడ్స్ తమదని.. అదికూడా తెలియకుండా విమర్శలు ఏంటని ప్రశ్నించారు. అయితే, ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు నారా భువనేశ్వరి... ఉల్లిధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె.. తన జీవితంలో ఉల్లి ధరలు ఇంత భారీగా పెరగడం ఎన్నడూ చూడలేదన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. ఇదే సమయంలో హెరిటేజ్‌లో ఉల్లి ధరలతో మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నారా భువనేశ్వరి... హెరిటేజ్ ఫ్యూచర్ గ్రూప్స్ వాళ్లదన్నారామే. ఇక ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి ఏంమాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి....