దత్తత గ్రామంలో చంద్రబాబు దంపతులు

దత్తత గ్రామంలో చంద్రబాబు దంపతులు

నారా భువనేశ్వరి దత్తత గ్రామం కొమరవోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభోత్సవాలు చేశారు. శివాలయంలో పూజలు చేసిన అనంతరం పంచాయతీ కార్యాలయ భవనం, సీసీ రోడ్లు, మహిళా సాధికార భవనాన్ని సీఎం దంపతులు ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ గృహకల్ప కింద నిర్మించిన 54 నూతన గృహాలను సీఎం దంపతులు ప్రారంభించారు.