హైదరాబాద్ మెట్రో ఎక్కిన నారా బ్రాహ్మణి, దేవాన్ష్

హైదరాబాద్ మెట్రో ఎక్కిన నారా బ్రాహ్మణి, దేవాన్ష్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణి ఆమె కుమారుడు దేవాన్ష్ తో కలిసి ఈరోజు ఉదయం హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించారు. జూబ్లిహిల్స్‌ మెట్రో స్టేషన్ లో ఎక్కిన ఆమె అక్కిడి నుండి లక్డీకాపూల్‌ వరకు ప్రయాణించారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె అక్కడికి వెళ్లినట్టు చెబుతున్నారు. లక్డీకాపూల్‌ లో దిగిన వెంటనే వారిరువురూ ప్రత్యేక వాహనంలో అక్కడి నుండి వెళ్లిపోయారు. హైదరాబాద్ మెట్రో ఎక్కాలన్న ఆసక్తితో ఆమె ప్రయాణించినట్లు తెలుస్తోంది. ట్రైయిన్‌లో వీరిని గుర్తు పట్టిన కొంతమంది ప్రయాణికులు సెల్ఫీలు అడిగి తీసుకున్నారని చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌ మెట్రోలో ఈ బ్రాహ్మణి ప్రయాణించడం ఇదే తొలిసారి.