తారక్ అన్నయ్య సినిమా చాలా బాగుంది - బ్రాహ్మణి

తారక్ అన్నయ్య సినిమా చాలా బాగుంది - బ్రాహ్మణి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే.  తారక్ కెరీర్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.  ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాను మెచ్చుకోగా తాజాగా బాలక్రిష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడ సినిమాను వీక్షించారు.  చిత్రం చాలా బాగుందని, అన్నయ్య తారక్ నటనపై ప్రశంసలు కురిపించింది.  అంతేకాదు విజయదశమి సందర్బంగా హరిక్రిష్ణ యొక్క అరుదైన ఫోటోలను కలెక్ట్ చేసి బహుమతిగా ఇచ్చిందట.