అమరావతి కలగానే మిగిలిపోతుందేమో : లోకేష్

అమరావతి కలగానే మిగిలిపోతుందేమో : లోకేష్

ఏపీ రాజధాని అమరావతికి 300 మిలియన్ డాలర్ల సహయన్ని నిలిపేస్తున్నట్టు వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ఇలా వరల్డ్ బ్యాంక్ వెనక్కు తగ్గడానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలేనని ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది.  తాజాగా నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ జగనన్న వచ్చారు, వరల్డ్ బ్యాంక్ పోయింది.  జగన్ గారి కల నెరవేరింది.  మొత్తానికి అమరావతిని పడగొట్టేసారు.  

రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇకసెలవంది. బాబుగారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయ్యింది.  అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే  కార్యాచరణలో జగన్ గారు మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో అన్నారు.