ఆదిమూలపు సురేష్‌కి లోకేష్‌ కౌంటర్‌.. మూర్ఖ‌పు రెడ్డి ఇష్టం అంటూ !

ఆదిమూలపు సురేష్‌కి లోకేష్‌ కౌంటర్‌..  మూర్ఖ‌పు రెడ్డి ఇష్టం అంటూ !

తనను విమర్శించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌కి లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. మీరు మొండిగా నిర్వ‌హిస్తామంటున్న ప‌రీక్ష‌ పాసో,ఫెయిలో నిర్ణ‌యించేది కాదు,15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు,ప‌రీక్ష నిర్వ‌హించే 30 వేల‌మంది ఉపాధ్యాయులు,ల‌క్షలాది కుటుంబ‌స‌భ్యులంద‌రితో క‌లిపి దాదాపు కోటి మంది ప్రాణాల‌కు ఇది విష‌మ‌ ప‌రీక్ష‌ అని అన్నారు. అందుకే మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించాల‌ని ముఖ్య‌మంత్రి గారికి లేఖ రాశాను. ఆ లేఖ రాసిన‌ త‌రువాతే ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. అందుకే మూర్ఖ‌పురెడ్డి అని సంబోధించాల్సి వ‌చ్చింది అని ఆయన అన్నారు. పంతాలు, ప‌ట్టింపులకు ఇది స‌మ‌యం కాదు. న‌న్ను మీ నోటికొచ్చిన‌ట్టు మ‌రో అర‌గంట తిట్టండి..కానీ ప‌రీక్ష‌లు మాత్రం ర‌ద్దు చేసి విద్యార్థుల్ని కాపాడండని ఆయన అన్నారు. నా విదేశీ చ‌దువు, ఫీజుల గురించి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వివ‌రాలు పంపిస్తాను,  మీరు బాగా చ‌దువుకున్న‌వారే కాబ‌ట్టి అవి మీకు అర్థ‌మై, మ‌రోసారి తాడేప‌ల్లి కాంపౌండ్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్‌తో ఆరోప‌ణ‌లు చేయ‌ర‌ని ఆశిస్తున్నానని అంటూ విమర్శించారు. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి మంచి మేన‌మామ అనిపించుకుంటాడో, ప‌రీక్ష‌లు పెట్టి కంసుడులాంటి మేన‌మామ అనిపించుకుంటాడో మీ మూర్ఖ‌పు రెడ్డి ఇష్టం అంటూ ఆయన కామెంట్స్ చేశారు. .