మహిళా డాక్టర్‌పై వైసీపీ నేతల వేధింపులు..ఆడియో క్లిప్ విడుదల చేసిన లోకేష్

మహిళా డాక్టర్‌పై వైసీపీ నేతల వేధింపులు..ఆడియో క్లిప్ విడుదల చేసిన లోకేష్

చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌. ఏపీలో దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని అంటూ ఆయన వరుస ట్వీట్ లు చేశారు. అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణి గారిని వేధించడం దారుణమని ఆరోపించారు లోకేష్‌. నిజాయితీగా వృత్తి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ, ఫోటోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. 

"గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డ పై వైకాపా గుండాల దాష్టీకం. జగన్ గారు అమలు చేస్తున్న రాజా రెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. వైకాపా నాయకుల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణి గారిని వేధించడం దారుణం, జగన్ గారూ! మీ దిశ చట్టం దిశ తప్పిందా? అన్యాయం జరిగింది అంటూ ఒక దళిత చెల్లెలు పోలీస్ స్టేషన్ కి వెళితే దిశ చట్టం నిందితులకు కొమ్ముకాయడం ఘోరం. చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలి. నిజాయితీగా వృత్తి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ,ఫోటోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలి" అంటూ ఆయన ట్వీట్ చేస్తూ ఆ మహిళా డాక్టర్ టీడీపీ మహిళా నేతతో మాట్లాడుతున్న ఆడియో క్లిప్పింగ్ ను కూడా ఆయన జత చేశారు.