నారాలోకేష్‌కు షాకిచ్చిన డిడిఆర్‌సీ

నారాలోకేష్‌కు షాకిచ్చిన డిడిఆర్‌సీ


టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ కు గుంటూరు జిల్లా అభివృద్ధి రివ్యూ కమిటీ షాకిచ్చింది. జిల్లా సమీక్షా సమావేశానికి లోకేష్‌ను ఆహ్వానించకూడదని తీర్మానించింది. గుంటూరు పర్యటన సందర్భంగా లోకేష్‌ సీఎం జగన్‌పై  చేసిన విమర్శలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యుడిగా ఉన్న లోకేష్‌ ను బహిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రతిపాదించగా, ఇతర ఎంఎల్‌ఏలు మద్దతు తెలిపారు. ఎంఎల్‌సీ లక్ష్మణరావు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. నారా లోకేష్‌ గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగాపై సీఎం తీరుపై మండిపడుతున్నారు. ఏపీలో ఇసుక అంశం నుంచి భవన నిర్మాణా కార్మికులు, సమాధులకు, కార్యాలయాలకు వైసీపీ రంగులు, ఇటీవలే సింగపూర్ ప్రాజెక్టు రద్దు ఇలా ప్రతీ అంశంపై జగన్ నిర్ణయాల్ని తప్పు పడుతూ ట్వీట్ల ద్వారా విమర్శల వర్షం కురిపించారు.