కొండను తవ్వి ఎలుకను పట్టారు..! జగన్‌కు భయం పట్టుకుంది..!

కొండను తవ్వి ఎలుకను పట్టారు..! జగన్‌కు భయం పట్టుకుంది..!

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులను.. తెలుగుదేశం పార్టీ నేతలకు ముడిపెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ప్రచారం మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. 'పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని' విమర్శించిన ఆయన.. ఇన్‌ఫ్రా కంపెనీల్లో దాడులు జరిగితే వాటిని టీడీపీకి ముడిపెట్టడానికి వైసీపీ తీవ్రప్రయత్నాలు చేస్తోందిన లోకేష్ ట్వీట్ చేశారు. ఇన్‌ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.. కానీ, టీడీపీకి ముడిపెట్టి అసత్య ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.85 లక్షలు పట్టుకుంటే.. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ. 2 వేల కోట్లు దొరికినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్... ఇక, రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపికి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు.