అందుకే కుప్పం నుండి పోటీకి దిగడంలేదు..

అందుకే కుప్పం నుండి పోటీకి దిగడంలేదు..

మంత్రి నారా లోకేష్.. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే, తొలిసారి పోటీ చేస్తుందున.. సేఫ్ నియోజకవర్గం బెటరనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆయన అనూహ్యంగా వైసీపీ సిట్టింగ్ స్థానమైన మంగళగిరిని ఎంచుకున్నారు. ఇక మంగళగిరిలో ప్రచారం నిర్వహించిన ఆయన... అసలు కుప్పం నుంచి ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పుకొచ్చారు. తమ కుటుంబ సభ్యులు ఏ నియోజవర్గంలో పోటీ చేస్తే అక్కడ అభివృద్ది పరుగులు పెడతుందని లోకేశ్ అన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలో 1989 మొదటిసారి చంద్రబాబు పోటీ చేసి గెలిచారని గుర్తుచేశారు. తప్పుడు ర్వాత ఆ ప్రాంతాన్ని భారీ స్థాయిలో అభివృద్ది చేసి చూపించారన్నారు. అలా గతంలో ఎవరికీ తెలియన ప్రాంతం పేరు ఇప్పుడు మారుమోగుతోందని..  ఏపీలో కుప్పం పేరు తెలియనివారుండరని వెల్లడించారు లోకేష్. అందువల్లే మా నాన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుండి నన్ను పోటీ చేయమని చాలామంది సూచించారన్న ఆయన.. కానీ, అది ముఖ్యమంత్రి బ్రాండ్. అక్కడి నుండి ఆయనే పోటీ చేయాలని కోరుకున్నా. అందుకోసమే మంగళగిరి నుండి పోటీ చేస్తున్నానని వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకరవర్గాలు అసూయ పడేలా మంగళగిరిని అభివృద్ది చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు లోకేష్.