ఫిదా అయ్యాను : నారా లోకేష్

ఫిదా అయ్యాను : నారా లోకేష్

ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుండటంతో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఆ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖను విడుదలచేశారు.  అందులో ప్రచారంలో తనకు తోడుగా ఉంటూ ఆప్యాయానురాగాలు కురిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతి గడపకు తిరిగి, ప్రతి మనిషిని పలకరించిన తనకు అందరి కష్టాలు తెలిశాయని, లక్షలాది మంది ప్రజల ప్రేమకు ఫిదా అయ్యాను అన్నారు.  చేనేత కార్మికులు, పసుపు రైతులు, స్వర్ణకారుల కష్టాలను తీర్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశానన్న లోకేష్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు.