"దటీజ్ ఎన్టీఆర్" అంటూ ట్వీట్ చేసిన నారా లోకేష్

"దటీజ్ ఎన్టీఆర్" అంటూ ట్వీట్ చేసిన నారా లోకేష్

నేడు దివంగత సీఎం ఎన్టీఆర్‌ 25 వ వర్ధంతి.   హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో, అటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్‌ తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. "సామాన్య రైతుబిడ్డగా పుట్టి వెండితెర దేవుడై వెలిగి మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపించారు. అరవై ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారు. దటీజ్ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ గారి లక్ష్యం.ఆయన కీర్తిశేషులై 25 ఏళ్ళు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయసాధనకు పునరంకితమవుదాం " అంటూ లోకేష్‌ పేర్కొన్నారు.