జగన్‌కు ఇచ్చిన మాటను గుర్తుచేస్తున్న లోకేష్

జగన్‌కు ఇచ్చిన మాటను గుర్తుచేస్తున్న లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్ ఈమధ్య ట్విట్టర్ వేదికగా అధికార వైకాపా పై ఎక్కువగా స్పందిస్తున్నారు.  ప్రశ్నలు అడగడం, కౌంటర్లు వేయడం వంటి పనులన్నీ ట్విట్టర్ ద్వారానే చేస్తున్నారు.  తాజాగా గతంలో తిత్లీ తుఫాను సంభవించినప్పుడు వైఎస్ జగన్ తాను అధికారంలోకి రాగానే బాధితులకు రూ. 3,435 కోట్లను నేరుగా ఇస్తానని హామీ ఇచ్చారు. 

ఇప్పుడు ఇదే హామీని లోకేష్ తెరపైకి తీసుకొచ్చారు.  తుఫాను అనగానే అట్నుంచటే హైదరాబాదుకు చెక్కేసిన మీరు, ఆ తర్వాత తీరిగ్గా వెళ్ళి, అధికారంలోకి రాగానే తిత్లీ తుఫాను నష్టం రూ.3,435 కోట్లను బాధితులకు నేరుగా ఇస్తానని సిక్కోలు ప్రజలకు చెప్పారు.  ఇచ్చిన మాట గుర్తుందా లేకపొతే ఏదైనా గాలికి కొట్టుకుపోయిందా అని జనం అడుగుతున్నారు జగన్‌గారు అంటూ అంటూ ప్రశ్నించారు.