జగన్ అరాచకాలు ఇంకెన్నాళ్లు? : లోకేష్ ఫైర్
సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ ఒక పిరికివాడని...అరాచకాలకు పాల్పడుతున్నాడని లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ అరాచకాలకు ఇంకెన్నాళ్లు ? అంటూ నిలదీశారు. "2019 లో పల్నాడు వెళ్లకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టి అడ్డుపడ్డారు. 2020 లో విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా చుట్టుముట్టారు. 2021లో రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించారు. పిరికి పాలకుడు జగన్ అరాచకాలు ఇంకెన్నాళ్లు? ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు. డెమోక్రసిని జగనోక్రసీతో అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేత హక్కులు హరిస్తున్న ప్రతీ సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది కాబోతోంది." అంటూ నారా లోకేష్ నిప్పులు చెరిగారు. కాగా.. చిత్తూరులో పర్యటించేందుకు చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే, చిత్తూరు వెళ్లేందుకు అనుమతులు లేవని, చెప్పడంతో చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)