మీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదు..!

మీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదు..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మీ పార్టీ పాలనలో సురక్షితంగా లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలికపై జరిగిన అత్యాచార ఘటనను ఖండించిన లోకేష్... ‘‘దేశంలోనే  సంచలనం కలిగించిన ఈ దుశ్చర్యలో నిందితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావడం సిగ్గు చేటు. జగన్‌ గారూ.. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదనే విషయం ఈ ఘటనతో స్పష్టమైంది'' అంటూ ట్వీట్ చేశారు లోకేష్. కాగా, తన స్నేహితుడిని కలవడానికి ఒంగోలు వచ్చింది ఓ బాలిక. ఇక, తన స్నేహితుడి ఫోన్ కలవకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న.. బస్టాండ్‌లోని వికలాంగుడు.. మాయమాటలు చెప్పి తన రూమ్‌కి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. అనంతరం ఓ రూమ్‌లో ఉండే విద్యార్థులకు ఆ బాలికను అప్పగించాడు. దీంతో మైనర్‌ బాలికపై ఆరుగురు కామాంధులు పదిరోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.