మీ కులరాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారెందుకు ?

మీ కులరాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారెందుకు ?

గత కొన్నాళ్ళగా ఏపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా తూర్పారబడుతున్న నారా లోకేష్ ఈరోజు ఎస్వీ యూనివెర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్ లను తొలగించిన విషయం మీద ప్రభుత్వాన్ని ఏపీ సీఎంను నిలదీశారు. జగన్ గారూ!..పవిత్రమైన విద్యాలయాలను కూడా మీ కుల రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారెందుకు? ఎస్వీ  యూనివర్సిటీలో అన్ని అర్హతలుండీ, ఆరేళ్ళుగా విధులు నిర్వహిస్తున్న టీచింగ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారు? మీకు కావాల్సిన ఒక సామాజిక వర్గం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తారా? మీ వైసీపీ కార్యకర్తలను అడ్డదారిలో యూనివర్సిటీలోకి పంపించి పునరావాసం కల్పించిన ఈ ఘటనపై విచారణ జరగాలి.  

ఏ కారణంతో ఉన్నవారిని తీసేసారు? ఏ ప్రాతిపదికన కొత్తవారిని తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతుచూస్తామంటూ విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు?  మీ ఇష్టానుసారం అక్రమాలు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతి సామాన్యుడికి ఉంది. ఆ హక్కును కాలరాసి, గొంతు నొక్కేస్తాం, అణగదొక్కేస్తాంలాంటి డైలాగులు ప్రజాస్వామ్యంలో చెప్తే... తెలుగుదేశం చూస్తూ ఊరుకోదు ఖబడ్ధార్! అంటూ లోకేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.