ఇసుక కొరతపై ఒక్కరోజు దీక్ష చేయనున్న నారా లోకేష్

ఇసుక కొరతపై ఒక్కరోజు దీక్ష చేయనున్న నారా లోకేష్

ఏపీలో ఇసుక కొరతపై సమర శంఖం పూరించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వీడి ప్రత్యక్షంగా రేపు దీక్షకు దిగనున్నారు. ప్రజలను కొరత వేధిస్తున్నా ప్రభుత్వ మెండి వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిరసన దీక్ష చేపడుతున్నారు. రేపు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష లోకేష్ చేయనున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు గుంటూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.