హత్యకు గురైన ప్రణయ్ కు వసంత రాయలు పాట అంకితం

హత్యకు గురైన ప్రణయ్ కు వసంత రాయలు పాట అంకితం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట.. ప్రణయ్ ను అంత దారుణంగా ఎందుకు చంపించారు.  పరువు కోసం ఇలాంటి హత్యలు కూడా చేయిస్తారా.. కూతురు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయిని ఇలా చంపించడం నేరం మహా పాపం అని ముచ్చటించుకుంటున్నారు.  సామాన్యులే కాకుండా సినిమా సెలెబ్రిటీలు సైతం ఈ హత్యపై స్పందిస్తున్నారు.  అమృతకు న్యాయం జరగాలని గట్టిగా పట్టుబడుతున్నారు.  రామ్ చరణ్, మంచు మనోజ్, రామ్ తదితరులు ఈ హత్యపై స్పందించిన సంగతి తెలిసిందే.  

కాగా, వీర భోగ వసంత రాయలు సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను ప్రణయ్ కు అంకితం ఇస్తున్నారు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  నారా రోహిత్, సుదీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రేయ శరన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేసుకున్నది.  క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంద్రసేనా ఆర్ దర్శకుడు.  ఈ సినిమాలోని మొదటి పాటను సెప్టెంబర్ 21 వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా పాటను అంకింతం చేస్తున్నట్టు ప్రకటించగానే.. అనేక మంది వీరభోగ వసంత రాయలు టీమ్ కు అభినందనలు తెలియజేశారు.