జగన్‌పై విరుచుకుపడిన నారా రోహిత్ !

జగన్‌పై విరుచుకుపడిన నారా రోహిత్ !

హీరో నారా రోహిత్ వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు.  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన తండ్రి రామ్మూర్తి, పెదనాన్న చంద్రబాబుల గురించి వస్తునం వార్తలపై రోహిత్ స్పందించారు.  తన తండ్రి, పెదనాన్న రామలక్ష్మణుల్లా కలిసున్నారని, అలాంటి వారి మధ్య విభేధాలున్నట్టు మాట్లాడటం తగదని అన్నారు.  

అసలు సొంత బాబుయి మీదే చేయి చేసుకున్న చరిత్ర మీది.  కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే మీకు  కుటుంబ బాంధవ్యాల గురించి ఏం తెలుసు.  మా పెదనాన్న మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తలు అవాస్తవం.  అయన మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.