రేపటి నుంచి నరసరావుపేటలో లాక్ డౌన్... పట్టణంలోకి అడుగుపెట్టాలంటే... 

రేపటి నుంచి నరసరావుపేటలో లాక్ డౌన్... పట్టణంలోకి అడుగుపెట్టాలంటే... 

గుంటూరు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తున్నది.  జిల్లాలో గుంటూరు తరువాత అత్యధికంగా నరసరావుపేటలో  కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పేటలో కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  ఏ సమయంలోనైనా నరసరావుపేటలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్టుగా ఎమ్మెల్యే ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.  

కాగా, రేపటి నుంచి పేటలో తిరిగి లాక్ డౌన్ విధించబోతున్నట్టు తెలుస్తోంది.  వివిధ ప్రాంతాల నుంచి నరసరావుపేటకు వచ్చే అన్ని రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు.   పట్టణంలోకి ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలనే నిబంధనను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని, ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమలు చేయబోయే లాక్ డౌన్ మరింత కఠినంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.