రామ్ చరణ్ ఇంటి ముందు గొడవ.. 5 కోట్లు ఇవ్వాలట

రామ్ చరణ్ ఇంటి ముందు గొడవ.. 5 కోట్లు ఇవ్వాలట

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ తన తండ్రితో 'సైరా' చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే.  ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.  అందుకే కొంత సినిమాను నరసింహారెడ్డి స్వస్థలం కర్నూలులో కూడా తీశారు.  అది కూడా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పంట పొలాల్లోనే చేశారు.  షూటింగ్ సమయంలో పొలాలు బాగా దెబ్బతిన్నాయని, పైగా తమ కుంటుంబానికి చెందిన వ్యక్తి జీవితంతో సినిమా తీస్తున్నారు కాబట్టి నిర్మాత చరణ్ 5 కోట్లు చెల్లించాలని నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు చరణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.  మరి దీనిపై చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.