పవన్‌లో ఆ లక్షణాలున్నాయ్: నరేష్‌

పవన్‌లో ఆ లక్షణాలున్నాయ్: నరేష్‌

రాజకీయంగా పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి దిక్సూచిగా ఉంటుందని తన నమ్మకం అని 'మా' అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్‌ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ గెలుపోటములతో తనకు సంబంధం లేదన్నారు. వ్యక్తిగా పవన్‌ చేస్తున్న సేవను అభిమానిస్తున్నానని చెప్పారు. యువతను మేల్కోలిపే లక్షణాలు పవన్‌లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు తీసుకురావాలని పవన్‌ కల్యాణ్‌ ఒక యోగిలా తిరుగుతున్నారని అన్నారు. 'మా' ఎన్నికల్లో నాగబాబు తనకు మద్దతు పలికారని.. నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్న ఆయనకు తను సపోర్ట్‌ ఉంటుందని నరేష్‌ చెప్పారు.