'మా' ఎన్నికల్లో గెలిచింది వీరే..

'మా' ఎన్నికల్లో గెలిచింది వీరే..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫలితాలను వెల్లడించారు.. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హీరో నరేష్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి శివాజీ రాజాపై నరేష్ 69 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో శ్రీకాంత్‌పై రాజశేఖర్ 15 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా రఘబాబుపై జీవిత గెలుపొందారు. మా ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించగా.. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై  రాజీవ్ కనకాల గెలుపొందారు. ఇక ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ పూర్తికాగా.. రాత్రి లోపే ఫలితాలు వెలువడుతాయని అంతా భావించారు. అయితే ఉత్కంఠ రేకెత్తిస్తూ మా ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సారి మా ఎన్నికల్లో 472 ఓట్లు పోల్ అయ్యాయి... ఇప్పటి వరకూ ఇదే మా ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోల్ అయ్యిందంటే.. ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. 

ఇక ఈసీ మెంబర్స్‌ విజయం సాధించినవారి వివరాలు.. 1. అలీ, 2. రవిప్రకాష్, 3. తనికెళ్ల భరణి, 4. సాయికుమార్, 5. ఉత్తేజ్, 6. పృథ్వి, 7. జాకీ, 8.సురేష్ కొండేటి, 9. అనితా చౌదరి, 10. అశోక్ కుమార్, 11. సమీర్, 12. ఏడిద శ్రీరామ్, 13.రాజా రవీంద్ర, 14. తనీష్, 15. జయలక్ష్మి, 16. కరాటి కళ్యాణి, 17. వేణుమాధవ్, 18. పసునూరి శ్రీనివాస్ గెలుపొందారు.