బెంగుళూరుపై కోల్‌కతా విజయం...

బెంగుళూరుపై కోల్‌కతా విజయం...
ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. 177 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్ జట్టు 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వెస్ట్ ఇండీస్ బౌలర్ సునీల్ నరేన్(50, 19బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)వీరవిహారం చేయడంతో స్కోరు బోర్డు పరుగలు పెట్టింది. నరేన్ కి తోడుగా జట్టు సభ్యులు నితిశ్ రాణా(34), దినేశ్ కార్తిక్(35) పరుగులు చేశారు. చివరలో రస్సెల్, వినయ్ కుమార్ సహాయంతో కోల్‌కతాను విజయతీరాకు చేర్చాడు దినేశ్ కార్తిక్. క్రిస్‌ వోక్స్‌ 3, ఉమేశ్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌(27 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్‌ (23 బంతుల్లో 44; 1 ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగారు. చివరలో మన్‌దీప్‌ సింగ్‌(18 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 176 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వినయ్‌ కుమార్, నితీశ్‌ రాణా చెరో 2 వికెట్లు తీశారు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన నరైన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.