నరైన్ మెరుపు ఇన్నింగ్స్.. పంజాబ్‌ లక్ష్యం 246

నరైన్ మెరుపు ఇన్నింగ్స్.. పంజాబ్‌ లక్ష్యం 246

ఐపీఎల్‌-11లో భాగంగా హోల్కార్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం క్రిస్ లిన్(27) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నరైన్ కు ఉతప్ప జతకలిసాడు. ఈ క్రమంలో సునీల్ నరైన్ (75; 36 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) మరింత ధాటిగా ఆడే ప్రయత్నంలో రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిసమయానికే ఉతప్ప(24) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఈ సమయంలో కెప్టెన్ దినేష్ కార్తీక్(50), రస్సెల్‌(31)లు బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డారు. వీరి నిష్క్రమణ అనంతరం గ్రీజ్ లోకి వచ్చిన రానా(11), గిల్(16)తక్కువ బంతుల్లో పరుగులు చేయడంతో కోల్‌కతా 245 పరుగుల భారీ స్కోర్ చేసి.. పంజాబ్‌ ముందు 246 పరుగుల లక్ష్యంను ఉంచింది. పంజాబ్‌ బౌలర్ ఆండ్రూ టై నాలుగు వికెట్లు తీసాడు.