రివ్యూ : @ నర్తనశాల

రివ్యూ :  @ నర్తనశాల

నటీనటులు : నాగశౌర్య, యామిని భాస్కర్, కాశ్మీర పరదేశి,  శివాజీ రాజా, జయప్రకాశ్ రెడ్డి, అజయ్ తదితరులు 

మ్యూజిక్ : మహతి స్వర సాగర్ 

ఫోటోగ్రఫి : విజయ్ సి కుమార్ 

నిర్మాత : ఐరా క్రియేషన్స్ 

దర్శకత్వం : శ్రీనివాస్ చక్రవర్తి 

రిలీజ్ డేట్ : 30-08-2018

ఊహలు గుసగుసలాడే వంటి వినూత్నమైన సినిమాతో హీరోగా  హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఐరా అనే సొంత నిర్మాత సంస్థను స్థాపించి ఛలో సినిమా చేశారు.  ఈ సినిమా హిట్టవ్వడంతో.. అదే స్పూర్తితో వినూత్నమైన కథాంశంతో @నర్తనశాల సినిమాను చేశారు.  శ్రీనివాస్ చక్రవర్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.  మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దామా. 

కథ : 

శివాజీ రాజా అమ్మ చనిపోవడంతో తనకు కూతురు పుడితే ఆ కూతురిలో అమ్మను చూసుకోవాలని అనుకుంటాడు.  శివాజీ ఆశలను వమ్ము చేస్తూ అబ్బాయి పుడతాడు.  కూతురు పుట్టాలన్న ఆశతో ఉన్న శివాజీ, తన కొడుకు నాగసౌర్యనే ఆడపిల్లలా పెంచుతాడు.  ఇంట్లో ఆడపిల్లలా పెరిగిన నాగశౌర్య.. పెద్దయ్యాక మహిళల కోసం ఓ సంస్థను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇస్తుంటాడు. అదే సమయంలో కాశ్మీర అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు.  కాశ్మీరకు దగ్గర కావాలని అనుకుంటున్న సమయంలో జయప్రకాశ్ రెడ్డి కూతురు యామిని భాస్కర్.. హీరో నాగశౌర్యను ప్రేమిస్తుంది.  అతను కూడా ఆమెను ప్రేమిస్తున్నాడని అనుకోని.. జయప్రకాశ్ రెడ్డితో ఈవిషయం చెప్తుంది. అటు నాగశౌర్య తండ్రికి ఈ విషయం తెలిసి ఆయన కూడా సరే అంటాడు.  నాగశౌర్య.. యామినిని ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోకుండా శివాజీ రాజా .. యామిని భాస్కర్ తండ్రిని కలిసి పెళ్లి సంబంధం మాట్లాడతాడు.  జయప్రకాష్ రెడ్డి కూడా పెళ్ళికి ఒప్పుకుంటాడు.  తండ్రి బలవంతం మీద పెళ్ళికి ఒప్పుకున్న నాగశౌర్య ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో తనను తాను ఓ గే గా పరిచయం చేసుకుంటాడు.  ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక చెప్పిన ఈ అబద్దం వల్ల నాగశౌర్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ప్రేమించిన కాశ్మీరను దక్కించుకున్నాడా లేదా..? చివరకు ఏమైంది అన్నది చిత్ర కథ.  

విశ్లేషణ : 

గే పాత్రతో కూడిన సినిమాలు తెలుగు సినిమాలో రాలేదు.  ఇలాంటి పాత్రలో నటించడం సాహసంతో కూడుకున్నదే.  చిన్న హీరో పైగా వినూత్నమైన సినిమాలు చేయడానికి నాగసౌర్య ఆసక్తి చూపుతాడు కాబట్టి ఈ పాత్రను ఎంచుకొని మంచి ప్రయోగమే చేశాడు.  బాలీవుడ్ లో వచ్చిన దోస్తానా సినిమాను గుర్తుకు తెస్తుంది ఈ సినిమా.  జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ లు ఎలాగైతే ఇంటికోసం గేలు గా నటించారో.. నర్తనశాలలో పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నాగశౌర్య గే గా నటిస్తాడు.  ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ,  హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నడిపించాడు.  శివాజీ రాజా, నాగశౌర్యల మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి.  సత్యం రాజేష్ కామెడీ పర్లేదు.  ఫస్ట్ హాఫ్ సోసో గా నడిపించాడు.  

ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.  తాను గే అని హీరో చేత చెప్పించి విశ్రాంతి ఇచ్చాడు.  సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ప్రేక్షకులకు విశ్రాంతి ముందు చెప్పేశాడు.  గే పాత్రను ఎలా చెప్తాడు అనే దానిపై ఇంటరెస్టింగ్ క్రియేట్ చేశాడు.  అజయ్ పాత్ర ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడే కథలో మలుపులు తిరిగింది. అజయ్ గే పాత్రలో కనిపించడం.. నాగశౌర్య, అజయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తి కలిగించే విధంగా ఉండటంతో ఈ ఎపిసోడ్ ను బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.  నాగసౌర్య, అజయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయో.. మిగతా సన్నివేశాలను కూడా అలాగే ఆసక్తి కలిగించే విధంగా దర్శకుడు డిజైన్ చేసుకొని ఉంటె సినిమా ఇంకా బాగుండేది.  అక్కడడక్కడ నటీనటుల యాక్షన్ శృతిమించి పోవడంతో బోర్ ఫీలింగ్ వస్తుంది.  ఇంటర్వెల్ ట్విస్ట్ తప్పించి సెకండ్ హాఫ్ లో ఆసక్తికలిగించే మలుపులు లేకపోవడంతో సినిమా మాములుగా రొటీన్ పద్దతిలో సాగుతుంది.  

నటీనటుల పనితీరు : 

అభినవ బృహన్నల పాత్రలో నాగశౌర్య ఒదిగిపోయి నటించాడు.  ఆ పాత్రలో సిగ్గుపడే తీరు బాగుంది.  హీరోయిన్లు పాటలకు, అందచందాలకే పరిమితమయ్యారు.  గే పాత్రలో అజయ్ నటన ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో అతని నటనే ప్లస్ అయింది. మిగతా నటులు ఎవరి పరిధికి వారు నటించారు.  

సాంకేతిక విభాగం పనితీరు : 

కొత్త దర్శకుడు ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసంతో కూడుకున్నదే.  కథలో ఉన్న పట్టు కథనాల్లో చూపించలేకపోయారు.  కథనాల్లో ఇంకాస్త పట్టు సాధిస్తే బాగుండేది.  మహతి స్వర సాగర్ సంగీతం బాగుంది.  పాటలు అద్బుతంగా ఉన్నాయి.  పాటల ప్రజెంటేషన్ కు పేరు పెట్టాల్సిన అవసరం లేదు.  ఐరా క్రియేషన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  ఎంటర్టైనర్ జానర్లో వచ్చిన ఈ సినిమాలో ఇంకొన్ని వినోదభరితమైన సన్నివేశాలు ఉంటె బాగుండేది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

నాగశౌర్య 

అజయ్ 

సంగీతం 

పాటలు 

బలహీనతలు : 

నటీనటుల ఓవర్ యాక్షన్ 

కథనాలు 

చివరిగా : అభినవ బృహన్నల నవ్వించే ప్రయత్నం చేశాడు..!!