విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా

విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా


చంద్రయాన్‌-2 ప్రయోగంలో తీవ్రంగా దెబ్బతిన్న విక్రమ్ శిధిలాలను అమెరికా అంతరిక్షశాఖ నాసా గుర్తించింది. భారత్‌కు చెందిన LRO శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రహ్మణ్యం సాయంతో దీన్ని గుర్తించినట్లు వెల్లడించింది. అత్యంతవేగంగా చంద్రుడి మీదకు దూసుకెళ్లిన విక్రమ్ ల్యాండర్ శకలాలు కూలిన ల్యాండర్ నుంచి చిందరవందరగా పడినట్లు నాసా తెలిపింది. కిలోమీటర్‌ దూరం వరకూ పడినట్లు తెలిపింది. నవంబర్‌ 11న LRO తీసిన చిత్రాలను విశ్లేషించిన అనంతరం నాసా కన్మర్మేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్‌ చంద్రుడి నేలను ఢీ కొట్టినచోట, ఎగిరిపడిన మట్టిరేణువులు.. దీనికి కచ్చితమైన సాక్ష్యంగా నాసా అధికారులు వెల్లడించారు.