ఈ చైన్ తో కరోనాకు చెక్ పెట్టొచ్చు... ఎలానో తెలుసా? 

ఈ చైన్ తో కరోనాకు చెక్ పెట్టొచ్చు... ఎలానో తెలుసా? 

కరోనా కేసులు రోజు రోజుకు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వైరస్ కు దానంతట అదే శరీరంలోకి ప్రవేశించే శక్తి లేదు.  మనమే ఆ వైరస్ ను శరీరంలోకి ప్రవేశించేలా చేస్తున్నాం.   మనిషిలోకి ప్రవేశించిన కరోనా వైరస్ మొదట ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది.  అక్కడి నుంచి మిగతా భాగాలకు వ్యాపిస్తుంది.  అయితే, కరోనా వైరస్ బయట నుంచి ఒక మనిషి శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ళద్వారా మాత్రమే ప్రవేశిస్తుంది.  మన చేతిని పదేపదే ముక్కుకు రుద్దడం వలన వైరస్ ముక్కుద్వారా లోనికి ప్రవేశిస్తుంది.  

అందుకే ముఖాన్ని చేత్తో ఎక్కువ సేపు తాకొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  రోజులో కనీసం 30సార్లు చేత్తో ముఖాన్ని తాకుతుంటారు.  ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఇది మనకు తెలియకుండానే  జరుగుతుంది. దీనినే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఈ చర్యను కంట్రోల్ చేసేందుకు నాసా ఓ వినూత్న లాకెట్ చైన్ ను తయారు చేసింది.  సెన్సార్ తో తయారు చేసిన ఈ లాకెట్ చైన్ ను మెడలో ధరిస్తే, ఆ చైన్ ఎప్పటికప్పుడు మనిషిని హెచ్చరిస్తుంది.  చేతి ముఖంపైకి వెళ్ళినపుడు లాకెట్ లోని సెన్సార్లు హెచ్చరిస్తాయి.  ఫలితంగా చేతిని వెనక్కి తీసుకుంటాం.  నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ దీనిని తయారు చేసింది.