కుజుడిపై అందాల బిలం!!

కుజుడిపై అందాల బిలం!!

సెప్టెంబర్ 2016, ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో అంగారక గ్రహంపై పెద్ద పేలుడు జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ పేలుడు కారణంగా అరుణ గ్రహం ఉపరితలం ఎవరో కుంచెతో అద్భుతంగా చిత్రించినట్టుగా మారడం అందరినీ ఆకర్షిస్తోంది. ది మార్స్ రికన్నైసెన్స్ ఆర్బిటర్ (ఎంఆర్ఓ) కొత్తగా ఏర్పడిన ఈ బిలాన్ని ఏప్రిల్ లో ఫోటో తీసింది. ఈ నెల ఆరంభంలో ఆ చిత్రాన్ని ఆన్ లైన్ లో షేర్ చేశారు.

ఉల్కల వలయానికి దగ్గరలో ఉండటం, పల్చని వాతావరణం కారణంగా కుజ గ్రహాన్ని బహుశా ఉల్కల భాగాలు, ఇతర వ్యర్థాలు తరచుగా ఢీ కొడుతూ ఉండవచ్చు. కానీ ఈ సారి చోటు చేసుకొన్న ఢీకొనడం ఆశ్చర్యకరమైన అపురూప దృశ్యానికి కారణమైంది. 'దీని ప్రభావం ఎంతగానో ఉంది. కొత్త బిలాలు 16 మీటర్లు (52 అడుగుల) వ్యాసం వరకు ఉన్నాయని' యుకె నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ప్లానెటరీ సైన్సెస్ రీసెర్చ్ నాయకుడు పీటర్ గ్రైండ్ రాడ్ ట్విట్టర్ లో రాశారు. 


Click link to see the Pic: https://twitter.com/Peter_Grindrod/status/1138734735147057153


ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న అంగారక ఉపరితలం శాస్త్రవేత్తలకు ఒక మంచి అవకాశం ఇస్తోంది. ఎప్పుడు ఎర్రటి ధూళితో కప్పబడి ఉండే కుజ గ్రహం ఇప్పుడు ఆ దుమ్ము తొలగిపోవడంతో  దగ్గర నుంచి పరిశీలించే వీలు కలిగింది.