ఐపీఎల్ 2021 : సన్ రైజర్స్‌కు షాక్…కీలక ప్లేయర్ ఔట్

ఐపీఎల్ 2021 : సన్ రైజర్స్‌కు షాక్…కీలక ప్లేయర్ ఔట్

ఐపీఎల్-2021 సీజన్.. సన్ రైజర్స్ కు అస్సలు అచ్చిరానట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి వరుస ఓటములతో సతమతమౌతోంది. సరైన మిడిల్ ఆర్డర్ లేకపోవడంతో మూడు మ్యాచులు ఓడిపోయింది సన్ రైజర్స్. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న రైజర్స్ కు మరో షాక్ తగిలింది.  ఆ జట్టు కీలక పేసర్ నటరాజన్ ఐపీఎల్ 2021 నుంచి వైదొలిగాడు. ఈ సీజన్ లో రెండు మ్యాచులు ఆడిన నటరాజన్.. మోకాలి నొప్పి గాయంతో ఆ తర్వాతి మ్యాచులు ఆడలేదు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో.. ఐపీఎల్ సీజన్ నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సన్ రైజర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నటరాజన్ గాయం.. సన్ రైజర్స్కు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.   ఇక ఇటీవలే రైజర్స్.. బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండె సంబంధిత సమస్య రావడంతో ఆయనను.. చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.