ఎన్నికల తర్వాతే జాతీయ సినీ అవార్డ్స్ !

ఎన్నికల తర్వాతే జాతీయ సినీ అవార్డ్స్ !

66వ జాతీయ సినీ అవార్డుల విజేతల్ని ఎన్నికల తర్వాతే ప్రకటించనున్నారు.  ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ ఒక ప్రకటన చేసింది.  దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల్ని ప్రభావితం చేసే ఏ అంశాల్ని మీడియా ద్వారా ప్రసారం చేయకూడదు.  అందువలనే ఈ ఏడాది ఆలస్యంగా విజేతల్ని ప్రకటించనున్నారు.  ప్రతిసారి ఏప్రిల్ నెలలో విజేతల్ని ప్రకటించి మే మొదటి వారంలో అవార్డుల ప్రధానోత్సవం ఉండేది.