ఏపీ సీఎస్‌కు ఎన్జీటీ కీలక ఆదేశాలు..

ఏపీ సీఎస్‌కు ఎన్జీటీ కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం.. మైనింగ్ వ్యవహారాలపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో ముందు హాజరయ్యారు ఏపీ సీఎస్... ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక సూచలను చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిపై భారీ జరిమానాలు విధించాలని సూచించిన ఎన్జీటీ.. జరిమానాలు విధించి మరెవరు అక్రమ తవ్వకాలు చేయకుండా నిరోధించాలంది. వైజాగ్, విజయవాడలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని.. కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని నేరుగా సీఎస్ పర్యవేక్షించాలని సూచించిన ఎన్జీటీ... ఆరు నెలల్లో మరోసారి సమావేశం కావాల్సి ఉంటుందని తెలిపింది. ఆరు నెలల తర్వాత స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని సూచించింది. కాలుష్య నియంత్రణ చర్యలపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి స్టేటస్ రిపోర్టులు తీసుకుంటుంది ఎన్జీటీ.. ’సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇసుక తవ్వకాలు, మైనింగ్, జల, గాలి కాలుష్యం నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తోంది.