రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ..

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ..

సార్వత్రిక ఎన్నికల్లో కౌటింగ్ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ... కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించిన హోంశాఖ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని పేర్కొంది. కౌంటింగ్‌కు ఆటంకం కలిగించే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించింది.